Monday, September 2, 2013

Yevaro jwalanu, Dr. Chakravarthi

Yevaro jwalanu
Lyrics: Aathreya
Singer: Ghantasala
Music: Saluri Rajeswara Rao


ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు(2)(ఎవరో)

అడుగు అడుగున అపజయములతో
అలసి సొలసిన నా హృదయానికి
సుధవై...సుధవై జీవన సుధవై
ఉపశాంతినివ్వగా ఓర్వనివారలు(ఎవరో)

అనురాగానికి ప్రతిరూపాలై
ఆది దంపతులవలె మీరుంటే(అనురాగానికి)
ఆనందంతో మురిసానే
ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం అపనిందేనా(ఎవరో)

మనిషికి మనిషికి మమత కూడదా..
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం
ఇది మారని లోకం
మానవుడే దానవుడై
మసలే చీకటి నరకం(ఎవరో)


yevaro jwalanu ragilincharu
verevaro daniki baliyainaru(2)(yevaro)

adugu aduguna apajayamulato
alasi solasina na hrudayaniki
sudhavai...sudhavai jeevana sudhavai
upashantinivvagaa vorvanivaralu(yevaro)

anuraganiki pratirupalai
aadi dampatulavale merunte(anuraganiki)
aanandamto murisaane
aatmeeyulugaa talachaane
anduku phalitam apanindenaa(yevaro)

manishiki manishiki mamata kudadaa..
manasu telusukonu manase ledaa
idi teerani shaapam
idi marani lokam
manavude danavudai
masale cheekati narakam(yevaro)

No comments:

Post a Comment