Friday, January 25, 2019

Naalo Neeku, Mr.Majnu

Naalo Neeku, Mr.Majnu
Singers : Shreya Ghoshal, Kaala Bhairava
Lyrics : Sri Mani
Music : SS Thaman


నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా
నీ కబురింక విననంటున్న
హృదయాన
నువ్వే నిండి ఉన్నావన్నది నిజమేనా

నాకే సాధ్యమా, నిన్నే మరువడం
నాదే నేరమా, నిన్నే కలవడం
ప్రేమను కాదనే, బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా, నేనే మిగలడం

గాయం చేసి వెళుతున్నా
గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలెనా
గమ్యం చేరువై ఉన్నా
తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా

ఓ నవ్వే కళ్ళతో
బ్రతికేస్తానుగా
నవ్వుల వెనక నీరై
నువ్వని చూపాక
తియ్యని ఊహలా
కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం
వుందని తెలుపక

నువ్వని యెవరని
తెలియని గురుతుగా
పరిచయం జరగనే
లేదంటానుగా

నటనై పోదా బ్రతుకంతా
నలుపై పోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలికా

మరిచే వీలు లేనంత
పంచేసావే ప్రేమంతా
తెంచెయ్యమంటే సులువేం కాదుగా

మనసులే కలవడం
వరమా శాపమా
చివరికి విడువడం
ప్రేమా న్యాయమా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా



Naalo neeku neelo naku selavena
Preme kaani preme vodulukuntunna
Nee kaburinka vinanantunna
Hrudhayana
Nuvve nindi unnavandhi nizamenaa

Naake sadhyamaa, ninne maruvadam
Naadhe neramaa, ninne kalavadam
Premanu kaadhaney, badhuley ivvadam
Yedho prashnalaa, nene migaladam

Gaayam chesi veluthunna
Gaayam laaga nenunnaa
Prayam intha chedhai migilenaa
Gamyam cheruvai unna
Theeram cheralekunna
Dhooram yentha jaale choopina

Naalo neeku neelo naku selavena
Preme kaani preme vodulukuntunna

Oh navve kallatho
Brathikesthanugaa
Navvula venaka neerey
Nuvvani choopaka
Thiyyani oohalaa
Kanipisthaanugaa
Oohala venuka bharam
Vundhani thelupaka

Nuvvani yevarani
Theliyani guruthugaa
Parichayam jaraganey
Ledhantaanugaa

Natanai podha brathukanthaa
Nalupai podha veluganthaa
Alupe leni aate chaalikaa

Mariche veelu lenantha
Panchesave premanthaa
Thencheymante suluvem kaadhugaa

Manasuley kalavadam
Varamaa shaapamaa
Chivariki viduvadam
Premaa nyaayamaa

Naalo neeku neelo naku selavena
Preme kaani preme vodulukuntunna

No comments:

Post a Comment