Saturday, November 30, 2013

Veyi Venuvula, Buddhimanthudu

Veyi Venuvula
Lyrics: Dasarathi
Music: KV Mahadevan
Singers: Ghantasala



వేయి  వేణువుల  మ్రోగేవేళ
హాయి వెల్లువై పొంగేవేళ
రాసకేళిలొ తేలేవేళ రాధమ్మను లాలించే  వేళ
నను  పాలింపగ  నడచీ వచ్చితివా గోపాలా
మొరలాలింపగ తరలీ వచ్చితివా... గోపాలా         ||నను||
అర చెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ
అరజారిన  పయ్యెదతో అదిగదిగో   గోపెమ్మా
ఎరుపెక్కిన కన్నులతో  ఇదిగిదుగో సత్యభామ
పొదపొదలో  ఎద ఎదలో నీ కొరకై  వెదుకుచుండగా  ||నను||
కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు
కరకు రాతి గుళ్లలో ఖైదీవై నిలిచావు
ఈభక్తుని గుండెలో ఖైదీగా వుండాలని
నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా...
మొరలాలింపగ తరలీ వచ్చితివా...గోపాల
నను  పాలింపగ నడచి వచ్చితివా



veyi  Venuvula  Mrogevela
Hayi Velluvai Pomgevela
Rasakelilo Televela Radhammanu Lalimce  Vela
Nanu  Palimpaga  Nadaci Vaccitiva Gopala
Moralalimpaga Tarali Vaccitiva... Gopala         ||nanu||
Ara Cedarina Tilakamuto Alladigo Radhamma
Arajarina  Payyedato Adigadigo   Gopemma
Erupekkina Kannulato  Idigidugo Satyabama
Podapodalo  Eda Edalo Ni Korakai  Vedukucumdaga  ||nanu||
Kamsuni Cerasalalo Kaidivai Puttavu
Kamtala Kaugillalo Kaidivai Perigavu
Karaku Rati Gullalo Kaidivai Nilicavu
Ibaktuni Gumdelo Kaidiga Vumdalani
Nanu Palimpaga Nadaci Vaccitiva
Moralalimpaga Tarali Vaccitiva...
Moralalimpaga Tarali Vaccitiva...gopala
Nanu  Palimpaga Nadaci Vaccitiva

No comments:

Post a Comment