Tuesday, September 3, 2013

Vidhi cheyu vintalannee, Maro Charitra

Vidhi cheyu vintalanne
Music : M. S. Viswanathan
Singers : Vani Jairam
Lyrics : Acharya Athreya


విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో(2)
విలపించే కధలు ఎన్నో...

ఎదురు చూపులు ఎదను పిండగా
ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరిచిపోవగా
నిదురపోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని
మనసొకటి దాని ఋజువని
తుది జయము ప్రేమదేయని
బలి అయినవి బ్రతుకులెన్నో...

వలచి గెలిచి కలలు పండిన
జంట లేదీ ఇలలో
కులమో మతమో ధనమో బలమో
గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగ రాదనీ
ఎడబాసి వేచినాము
మన గాధే యువతరాలకు కావాలి మరోచరిత్ర
కావాలి మరోచరిత్ర

vidhi cheyu vintalannee matileni chetalenani
virahaana vegipoyi vilapinche kadhalu yenno(2)
vilapinche kadhalu yenno...

yeduru chupulu yedanu pindagaa
yellu gadipenu shakuntala
viraha badhanu marichipovagaa
nidurapoyenu urmila
anuraagame nijamani
manasokati dani rujuvani
tudi jayamu premadeyani
bali ayinavi bratukulenno...

valachi gelichi kalalu pandina
janta ledee ilalo
kulamo matamo dhanamo balamo
gontu kosenu tudilo
adi nedu jaruga raadani
yedabasi vechinaamu
mana gaadhe yuvataraalaku kavali marocharitra
kavali marocharitra

3 comments:

  1. ఎవరు వ్రాయగలరు ఇలా ఆత్రేయ తప్ప

    ReplyDelete
  2. అజరామరం ఆయన పాటలు

    ReplyDelete
  3. అసహాయతను తెలియ పరచి, ఆలోచింపజేసి, సందేశాన్ని మిలితం చేయగలగడం... ఆత్రేయ గారికే సాధ్యం.

    ReplyDelete