Wednesday, September 4, 2013

Udaya giri, Megha Sandesam

Udaya giri
Music: Ramesh Naidu 
Artist(s): Yesudas 

Lyricist: Devulapalli Krishnasasthri 


ఉదయ గిరి పైన అదిగో గగనాన
కదలె దినరాజు తేరు
ఒదిగి చిరుగాలి నిదుర తెర జారి కదలె గోదారి నీరు
కదలె గోదారి నీరు

ఏ సీమల ఏమైతివో...ఏకాకిని నా ప్రియా
ఏకాకిని నా ప్రియా
ఏలాగీ వియోగాన వేగేనో ..నా ప్రియా
ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా ప్రియా ప్రియా
ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ
వీలు పడదు సుమ్మీ..

ఊపి ఊపి  మనసునొక్కొక్క వేదన
కావ్యమవును మరియు గానమవును
నేటి బాధ నన్ను మాటాడగానీని
ప్రళయమట్లు వచ్చి పడియె పైని

దారులన్నియు మూసె దశదిశలు ముంచెత్తి
నీ రంద్ర భయదాందకార జీమూతాళి ప్రేయసీ ప్రేయసీ
వెడలి పోయితివేల ఆ అగమ్య తమస్వినీ గర్భ కుహరాల
తమస్వినీ గర్భ కుహరాల

లోకమంతా పాకినవి పగటి వెలుగులు
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు
రాకాసి చీకట్ల మూలుగులు

ఎపుడు నీ పిలుపు వినబడదో
అపుడు నా అడుగు పడదు
ఎచటికో పైనమెరుగక ఎందుకో వైనమందక
నా అడుగు పడదు

అది ఒకానొక మలు సందె
ఎదుట గౌతమీ నది ఇరు దరులొరసి
మింటి చాయలను నెమరు వేసికొనుచు సాగినది
అపుడు అపుడే కలిగె నాకొక్క దివ్యానుభూతి
కలిగె నాకొక్క దివ్యానుభూతి

శూన్యాకాశము వలె చైతన్య లవము లేని
బ్రతుకు దారుల శోభానన్యంబు ఒక శంపాలత
కన్యక తొలి వలపు వోలె కాంతులు నించెన్

అంతరాంతరమున వింత కాంతి నిండి
ఊహలకు రెక్కలొచ్చి ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె అలతి కవితలు వెలువడి
అంతలోన
కనుమొరగి చనె మెరపు చీకటులు మిగిలె
అపుడు ఎలుగెత్తి పిలిచినాను
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను
రోదించినాను
వెదకి వెదకి వేసారితి వెర్రినైతి

ఆశలు రాలి ధూళి పడినప్పుడు
గుండెలు చీల్చు వేదనావేశము బ్రేల్చినప్పుడు
వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశము రక్త బిందువులలో
రచియించితి నేను
మేఘ సందేశము రూపు దాల్చెనది నేడు
ఇది ఏమి మహా కవిత్వమో..

శోకమొకటియ కాదు సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయ
కరుణ ఒకటే కాదు రసము జీవితమున కవికి వలయు ఎన్నో వివిధానుబూతులు ఎడద నిండా
నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై
నా మన్కియే పూవులున్,కాయల్, పండ్లును నిండు నందనముగానైనన్
వ్యధ, వేదనల్ మాయమై
సుఖ శాంత జీవనము
సంప్రాప్తించి పూర్ణుండనై
వ్రాయన్ జాలుదు మానవానుభవ
దివ్యత్ కావ్య సందోహమున్  


udaya giri paina adigo gaganana
kadale dinaraju teru.
odigi chirugali nidura tera jaari
kadale godaari neeru
kadale godaari neeru

 ye seemala yemaitivo....yekaakini naa priyaa...
yekaakini naa priyaa...
yelaagee viyogaana vegenoo..naa priyaa..
yelaagee meghamaasamegeno priyaa priyaa priyaa..
ghadiya ghadiya oka shilayai kadaladu summee
yeda lopala nee rupamu chedaradu summee
padi raavaalante veelu padadu summee
veelu padadu summee..

upi upi manasunokkokka vedana
kaavyamavunu mariyu gaanamavunu
neti badha nannu mataadagaaneeni
pralayamatlu vachi padiye paini

daarulanniyu muse dashadishalu munchette
ne randhra bhayadaandhakaara jeemutaali preyasee preyasee..
vedalipoyitivela aa agamya tamasvinee garbha kuharaala
tamasvinee garbha kuharaala

lokamantaa pakinavi pagati velugulu
naku matram rakaasi cheekatla mulugulu
rakaasi cheekatla mulugulu
 
epudu nee pilupu vinabadado
apudu naa adugu padadu
yechatiko payanamerugaka yenduko vainamandaka
naa adugu padadu..

adi okaanoka malusande
yeduta gowthamee nadi
iru darulorasi minti chaayalanu
nemaru vesikonuchu saaginadi
apudu apude kalige nakokka divyaanubhuti
kalige nakokka divyaanubhuti

shunyaakaashamu vale
chaitanya lavamu leni bratuku daarula
   shobhaananyambu oka shampaa lata
kanyaka tolivalapu vole kaantulu ninchen

antaraantaramuna vinta kaanti nindi
uhalaku rekkalochi pratyusha pavana laalanamunaku vichu sumaala vole
alati kavitalu veluvade
antalona
kanumoragi chane merapu cheekatulu migile
apudu yelugetti pilichinanu
apudu daari teliyaka velugu koraku rodhinchinanu
rodinchinanu vedaki vedaki vesaariti verrinaiti

aashalu raali dhuli padinappudu
gundelu cheelchu vedaanaaveshamu vrelchinappudu
vivekamu golpadi salpinatti aakroshamu raktabinduvulalo rachiyinchiti nenu
meghasandeshamu rupudaalchenadi nedu
idi yemi mahaa kavitvamo..

shokamokatiya kaadu sushlokamaina kaavyamunaku
jeevamu poya
karuna okate kaadu rasamu jeevitamuna
kaviki valayu yenno vividhaanubhutulu yedada nindaa

naa anveshana yennaden saphalamai
na mankiye puvulun, kayal, pandlunu nindu nandanamugaanainan
vyadhaa vedanal mayambai
sukha shaanta jeevanamu
sampraaptinchi purnundanai
vraayan jaaludu manavaanubhava
divyat kaavya sandohamun

No comments:

Post a Comment