Wednesday, September 4, 2013

Mundu telisenaa, Megha Sandesam

Mundu telisenaa
Artist(s): Susheela 
Lyricist: Devulapalli Krishnasasthri 
Music :: Ramesh Naidu


ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త (ముందు తెలిసేనా)

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే!!2!!
సుందర మందార కుంద సుమదళములు పరువనా!!2!!
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును (ముందు తెలిసెనా)

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు!!2!!
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు!!2!!
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి (ముందు తెలిసెన)

mundu telisenaa prabhuu
ee mandiramitulunchenaa
mandamatini neevu vacchu
madhura kshanamedo.. kaasta (mundu telesena)

andamugaa nee kanulaku vindulugaa vaakitane!!2!!
sundara mandaara kunda sumadalamulu paruvanaa!!2!!
daari podugunaa tadisina paarijaatamulapai
nee adugula gurutule nilichinaa chaalunu (mundu telisena)

bratukantaa eduruchoochu pattuna raane raavu!!2!!
edura rayani vela vacchi itte maayamoutaavu!!2!!
kadalaneeka nimushamu nanu vadalipoka nilupaga
nee padamula bandhimpalenu hrudayamu sankela chesi (mundu telisena)

No comments:

Post a Comment