Tuesday, September 3, 2013

kalayaa nijamaa, Cooli No. 1

Kalayaa nijamaa
Music : Ilayaraja
Singers : Illayaraja, P. Susheela


కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ(2)
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా..

లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నది
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నది
కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నది
కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక తిరుగుతున్నవి
ముంచే మైకమో మురిపించే మోహమో..

చేయి వేయనా సేవ చేయనా ఓయ్ అనే వయ్యారమా
పాల ముంచినా నీట ముంచినా నీ దయే శృంగారమా
ఆగలేని ఆకలేమిటో పైకి పైకి దూకుతున్నది
కాలు నేల నిలువకున్నది ఆకాశాన తేలుతున్నది
అంతా మాయగా అనిపించే కాలము..


kalayaa nijamaa tolireyi haayi mahima(2)
alavatu leni sukhamaa ika ninnu apataramaa
anigunna aadatanamaa ikanaina melukonumaa..

leniponi ye kuniragamo lechi raa antunnadi
urukoni ye verri koriko teerchavaa antunnadi
koka mulla kupee teese kaipu chupu korukutunnadi
kurra kallu cheera gallalo dare leka tirugutunnavi
munche maikamo muripinche mohamo..

cheyi veyanaa seva cheyanaa oy ane vayyaramaa
pala munchinaa neeta munchinaa ne daye shrungaramaa
aagaleni akalemito paiki paiki dukutunnadi
kalu nela niluvakunnadi aakaashaana telutunnadi
antaa mayagaa anipinche kalamu..

4 comments: